Thursday, April 17, 2008

వందనాలు

వందనాలు నీకు ఇవే

నా విన్నపాలు నీకు

నీ చూపు తాకి వేకువయ్యను

ఎదురు చూపుల వేళ వేన్నేలయ్యను

కానరాని నీ కోసం కనులు వీ సారే

కాలమంత కరిగి కన్నేరయే

జీవితం ఎండ మావి పరుగాయే


ప్రేమభవమిది పెదవిదటలేదు

మధురగేయమిది అలపించలేను

విరహవేదన నాది విన్నపించలేను

మూగ రోదన నాది, మరణయాతన ఇది

కటినశిలవు నీవు కరుణ లేదు నీకు

మనసు లేదు నీకు మమత తెలీదు నీకు


నైషధం కాదిది నైరాశ్యం

ప్రణయ ప్రభంధం కాదిది ప్రేమ పారవశ్యం

మౌనంగా నేను ధ్యానిస్తా

నిన్నే సర్వంగా భావిస్తామదిని దోచిన నీకు వందనాలు

ఎదను కాల్చిన నీకు మౌన నివేధనలు

శ్రీ

Thursday, February 28, 2008

హార్ట్ బీట్

ఆకాశం ఏడిస్తే
హరివిల్లు
హృదయానికి బాధేస్తే
కన్నీళ్ళు.